మరో ముగ్గురు జవాన్లకు గాయాలు
జమ్ముకశ్మీర్‌లో ఘటన
న్యూఢిల్లీ, నవంబర్ 10: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఆదివారం జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ ఆర్మీ అధికారి అమరుడయ్యారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. జమ్ముకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్ జిల్లాలో ఇద్దరు గ్రామ రక్షణ భటులను ఉగ్రవాదులు ఇటీవల కిడ్నాప్ చేసి హతమార్చారు. దీంతో ఉగ్రవాదులను పట్టుకోవడానికి భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో కేశ్వాన్ అటవీ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటు చేసు కున్నాయి.
ఈ కాల్పుల్లో ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్‌కు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ నాయబ్ సుబేదార్ రాకేశ్ కుమార్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. కాగా, కేశ్వాన్ అటవీ ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులు నక్కి ఉన్నట్టు భద్రతా బలగాలు భావిస్తూ సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.