26-03-2025 12:00:00 AM
వార్తలను తోసిపుచ్చిన సైన్యం
ఢాకా, మార్చి 25: బంగ్లాదేశ్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించి, సైనిక పాలన తీసుకురావడానికి ఆ దేశ ఆర్మీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేతగా విధులు నిర్వర్తిస్తున్న మహ్మద్ యూనస్‌ను త్వరలోనే తొలగించి, సైన్యం నియంత్రణ చేపట్టే అవకాశం ఉంది. బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ నేతృత్వంలో సోమవారం అత్యవసర సమావేశం జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ రాజ గందరగోళం నేపథ్యంలోనే యూ త్వరలోనే చైనాలో పర్యటించనున్నారు. బంగ్లాలో సైనిక పాలన రాబోతుందంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ సహా ఇతర ఉన్నతా తూలు ఖండించారు. షేక్ హసీనా ప్రభుత్వాన్ని దింపేసిన విద్యార్థి నాయకులు నేషనల్ సిటిజన్స్ (ఎన్‌సీపీ) పేరి కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో బంగ్లాలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.