calender_icon.png 26 April, 2025 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్మీ చీఫ్ జనరల్ వరుస సమీక్షలు

26-04-2025 01:19:07 AM

భద్రతా పరిస్థితులపై ఆరా

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం కశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో భేటీ అయ్యారు. భద్రతా పరిస్థితులపై సమీక్షించారు. శ్రీనగర్, ఉదంపుర్‌లో పర్యటించిన ఆయన.. కశ్మీర్ లోయలోని ఆర్మీ కమాండర్లు, ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో చర్చలు జరిపారు.

శ్రీనగర్‌లోని 15 కార్ప్స్‌కు చెందిన ఆర్మీ జనరల్ ఆఫీస్ కమాండర్ భద్రతా పరిస్థితులపై ద్వివేదికి వివరించారు. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ సైన్యం తూట్లు పొడుస్తున్న వేళ ఈ వరుస సమీక్షలతో ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా పహల్గాంలో దాడి జరిగిన ప్రదేశాన్ని సైతం ఆయన సందర్శించనున్నట్టు తెలిసింది.