పాల్గొన్న ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి...
కోదాడ: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి సమక్షంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్వతంత్ర సమరయోధులు, చిలుకూరు మండలం ఆచార్యులగూడెంకు చెందిన ముసి కనకయ్య 100వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో వారి కుమారులు ముసి కృష్ణయ్య, కోదాడ నియోజకవర్గ ముదిరాజ్ సంఘం కన్వీనర్ ముసి శ్రీనివాస్ ముదిరాజ్, వారి కుటుంబ సభ్యులు ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు భాష బోయిన భాస్కర్, నియోజకవర్గ ముదిరాజ్ సంఘం పెద్దలు అల్లి వీరబాబు, ముసి మట్టయ్య పాల్గొన్నారు.