calender_icon.png 13 January, 2025 | 11:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఎస్సీ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు!

16-07-2024 12:15:00 AM

18 నుంచి పరీక్షలు

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): ప్రభుత్వం డీఎస్సీని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పకడ్బందీగా డీఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఈనెల 18 నుంచి ఆగస్టు 5 వరకు 56 సెంటర్లలో పరీక్షలు జరగనున్నాయి. రోజుకు రెండు షిఫ్టుల చొప్పున పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి. ఈక్రమంలో నే డీఎస్సీ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో అభ్యర్థులకు అధికారులు సూచించారు. ఈనెల 11వ తేదీ నుంచే ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు అందుబాటు లో ఉన్నాయని.. ఇప్పటి వరకు డౌన్‌లోడ్ చేసుకోనివారు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లో డ్ చేసుకోవాలని సూచించారు. విద్యాశాఖ విడుదల చేసిన కొన్ని హాల్‌టికెట్లతో అభ్యర్థులు గందరగోళానికి లోనవుతున్నారు. కొంత మం ది అభ్యర్థులకు వారు చేసిన పొరపాట్ల కారణం గా తప్పులు దొర్లుతుంటే, మరికొన్ని సాంకేతిక తప్పిదాల వల్ల చోటుచేసుకుంటున్నాయి.