అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) ముకుందరెడ్డి
హైదరాబాద్‌సిటీబ్యూరో, నవంబర్ 12 (విజయక్రాంతి) : ఈనెల 17, 18 తేదీల్లో టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో జరుగబోయే గ్రూప్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) జి.ముకుందరెడ్డి, డీఆర్‌వో ఈ.వెంకటాచారి అధికారులకు సూచించారు. గ్రూప్ పరీక్ష నిర్వహణపై మంగళవారం అధికారులతో ట్రైనింగ్, కోఆర్డినేషన్ మీటింగ్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో 102 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని.. 45,918 మంది అభ్యర్థులు హాజరు కాబోతున్నారని తెలిపారు. ఈనెల 17న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పేపర్ 1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్), మధ్యాహ్నం పేపర్ 2 (హిస్టరీ అండ్ పొలిటికల్, సొసైటీ) మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటుందని తెలిపారు.
18న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 12.30 గంటల వరకు పేపర్ అండ్ డెవలప్‌మెంట్) పరీక్ష ఉంటుంన్నారు. అభ్యర్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ భాస్కర్, ఏసీపీ కిషన్, జాయింట్ కస్టోడియన్స్, చీఫ్ సూపరిండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.