calender_icon.png 8 April, 2025 | 8:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతా పయనంలో పవన్‌గా..

07-04-2025 12:00:00 AM

సీనియర్ నటుడు అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్న తాజాచిత్రం ‘సీతా పయనం’. ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. అర్జున్ ఒక ముఖ్య పాత్ర లో కనిపించనున్నారు. పవర్‌ఫుల్ పాత్రను పోషించడానికి ధ్రువ సర్జా ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు.  శ్రీరామ నవ మి సందర్భంగా ధ్రువ ఫస్ట్‌లుక్‌ను నిర్మాతలు విడుదల చేశారు. పోస్టర్‌లో ధ్రువ  మాస్ అప్పీల్‌లో కనిపించారు. ఈ చిత్రానికి డీవోపీ: జీ బాల మురుగన్; సంగీతం: అనుప్ రూబెన్స్; మాటలు: సాయిమాధవ్ బుర్రా; కూర్పు: అయూబ్ ఖాన్; కథ, దర్శకత్వం: అర్జున్ సర్జా.