calender_icon.png 10 January, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్జున్‌కు నాలుగో ర్యాంక్

02-01-2025 12:00:00 AM

న్యూఢిల్లీ: ఫిడే చెస్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి సత్తా చాటాడు. బుధవారం విడుదలైన ర్యాంకింగ్స్‌లో అర్జున్ నాలుగో ర్యాంకులో నిలిచాడు. అర్జున్ ఖాతాలో 2801 ఎలో రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. దిగ్గజం ఆనంద్ తర్వాత అత్యధిక రేటింగ్ కలిగిన ఆటగాడిగా అర్జున్ నిలిచాడు. ప్రపంచ చెస్ చాంపియన్ గుకేశ్ దొమ్మరాజు (2783 పాయింట్లు) ఐదో స్థానం దక్కించుకున్నాడు.

ఇక విశ్వనాథన్ ఆనంద్ (27౫౦ పాయింట్లు) పదో స్థానంలో నిలిచాడు. తొలి స్థానాన్ని నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్ (2831 పాయింట్లు) నిలబెట్టుకున్నాడు. ఆర్. ప్రజ్ఞానంద 13వ స్థానంలో ఉన్నాడు. మహిళల విభాగంలో తెలుగు తేజం కోనేరు హంపి (2523 పాయింట్లు) ఆరో స్థానంలో నిలిచింది.

తొలి స్థానంలో హు యిఫన్ (2633 పాయింట్లు) ఉండగా.. రెండో స్థానంలో జు వెంజున్ (2561 పాయింట్లు) ఉంది. దివ్య దేశ్‌ముఖ్, హారిక వరుసగా 14, 16వ స్థానాల్లో ఉన్నారు.