calender_icon.png 15 January, 2025 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్జున్‌దే చెస్ మాస్టర్స్

19-10-2024 12:00:00 AM

లండన్: తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి డబ్యూఆర్ చెస్ టైటిల్ విజేతగా నిలిచాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్ మాక్సిమే లాగ్రేవ్‌ను ఆర్మ్‌గెడాన్ గేమ్‌లో చిత్తు చేసి చాంపియన్‌గా నిలిచాడు. క్లాసికల్ చెస్ విధానంలో జరిగిన గేమ్‌లో రెండు డ్రాలే చేసుకున్న అర్జున్ ఆర్మ్‌గెడాన్‌లో మాత్రం 69 ఎత్తుల వద్ద విజయం సాధించాడు.

ఇక సెమీస్‌లో భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందను చిత్తు చేసిన అర్జున్ తొలి గేమ్‌లో శివానంద (ఇంగ్లండ్), రెండో రౌండ్‌లో విదిత్ గుజరాతీని మట్టికరిపించాడు.  ఈ విజయంతో అర్జున్ 2800 ఎలో రేటింగ్ పాయింట్స్‌కు మరింత దగ్గరయ్యాడు.