calender_icon.png 26 October, 2024 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతను పరిచయం చేసిన అర్జున్

23-10-2024 12:00:00 AM

ప్రముఖ నటుడు అర్జున్ సర్జా తన కొత్త ప్రాజెక్టును ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు ఆరేళ్ల తర్వాత తిరిగి మరో కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఆయన దానికి ‘సీతా పయనం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అర్జున్ స్వీయ దర్శకత్వంలో శ్రీరామ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇది రూపొందనుంది. ఈ చిత్రంలో సీత పాత్రను పరిచయం చేస్తూ ఒక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

సీత పాత్రలో నటిస్తున్నది మరెవరో కాదు.. అర్జున్ ముద్దుల కూతురు ఐశ్వర్య. అర్జున్ దర్శకత్వంలో 2018లో ఒక తమిళ్ సినిమా వచ్చింది. దాని తర్వాత ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా కన్నడ, తెలు గు, తమిళ్ భాష ల్లో విడుదల కానున్నది.