న్యూయార్క్: వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసికి మిశ్రమ ఫలితాలు వచ్చా యి. ఐదు రౌండ్లలో నాలుగు రౌండ్లు గెలిచి ఒక మ్యాచ్ ఓడిన అర్జున్ ఐదో స్థానంలో నిలిచాడు. ర్యాపిడ్‌లో మరో 8 గేములు మిగిలి ఉండగా అవి నేడు జరగనున్నాయి. ర్యాపిడ్‌లో 13 రౌండ్లు పూర్తయిన తర్వాత బ్లిట్జ్‌లో ఆటగాళ్లు పోటీ పడనున్నారు. ప్రతీ ఆటగాడికి మూడు నిమిషాల సమయం కేటాయిస్తారు. ఆటగాళ్లను నాకౌట్ స్టేజ్‌కు పంపిస్తారు. మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక రెండో స్థానంలో నిలిచింది.