వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్
న్యూయార్క్: భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజు మంచి ఫలితాలు సాధించాడు. తొలుత రాబ్‌సన్ రేను ఓడించిన అర్జున్ ఆ తర్వాత షాంత్ సర్స్‌యాన్ (ఆర్మేనియా)ను చిత్తు చేశాడు. ముర్జిన్, జాన్ క్రిస్టోఫ్‌తో డ్రా చేసుకున్న అర్జున్ 7 పాయింట్లు సాధించాడు. టోర్నీలో మరో నాలుగు రౌండ్లు మిగిలి ఉన్నాయి. 9 రౌండ్ల అనంతరం రష్యన్ గ్రాండ్‌మాస్టర్ వొలొడర్ ముర్జిన్, అలెగ్జాండర్ (రష్యా), జాన్ క్రిస్టోఫ్ (పోలండ్)తో కలిసి సంయుక్తంగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. మహిళల విభాగంలో తెలుగు గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, హారిక చైనాకు చెందిన వెన్‌జున్‌తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నారు.
వివాదంలో కార్ల్‌సన్..
ప్రపంచ నంబర్‌వన్, నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్‌సన్ టోర్నీ నుంచి వైదొలి గాడు. డ్రెస్‌కోడ్ పాటించకపోవడంతో కార్ల్‌సన్‌పై చీఫ్ ఆర్బిటర్ అలెక్స్ హోలోసక్ అతడిపై అనర్హత వేటు వేశాడు. జీన్స్ వేసుకొని ఈవెంట్‌లో పాల్గొనడంతో కార్ల్‌సన్‌కు జరిమానా పడింది. కార్ల్‌సన్ వైదొలగడంతో అర్జున్ విజయావకాశాలు పెరిగినట్లే.