calender_icon.png 19 April, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనుషుల మధ్య అర్జున్.. మృగాల మధ్య సర్కార్

15-04-2025 12:03:31 AM

స్టార్ హీరో నాని నుంచి వస్తున్న తాజాచిత్రం ‘హిట్3: ది థర్డ్ కేస్’. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నాని యూనానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ సోమవారం విడుదలైంది. చిత్రబృందం వైజాగ్‌లో ఏర్పాటుచేసిన ఈవెంట్‌లో ఈ ట్రైలర్‌ను ఆవిష్కరించారు.

నాని క్యారెక్టర్ అర్జున్ సర్కార్‌కు ఫెరోషియస్ టోన్ సెట్ చేసే సీక్వెన్‌తో ప్రారంభమవుతుందీ ట్రైలర్. క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 ఫీట్ల సెల్‌లో ఉండాలి.. లేదా భూమిలో 6 ఫీట్ల గుంతలో ఉండాలి’ అంటూ నాని చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. 9 నెలల పాప కిడ్నాప్‌తో సినిమా కథ ప్రారంభమవుతుంది. న్యాయం కోసం అర్జున్.. క్రూరమైన, అత్యంత హింసాత్మకమైన మార్గాన్ని ఎంచుకున్న తీరును ఇందులో చూపించబోతున్నారు.

అర్జున్ లవర్‌గా శ్రీనిధిశెట్టి ఆకట్టుకుంది. నిన్ను ఏమని పిలవాలి అని తన ప్రేయసి అడిగితే.. ‘మనుషుల మధ్య ఉంటే అర్జున్.. మృగాల మధ్య ఉంటే సర్కార్’ అని అర్జున్ సర్కార్ బదులిచ్చిన తీరుతో ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని తెలియజేశాడు డైరెక్టర్. అంటే నేరస్థులపై చేసే పోరాటంలో కనికరం లేనివాడిగా కనిపించే సర్కార్‌ను అతని వ్యక్తిగత జీవితంలో సున్నితమైన వ్యక్తిగా చూడొచ్చు అని చెప్పకనే చెప్పాడు. మే 1న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్; సంగీతం: మిక్కీ జే మేయర్; ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్.