calender_icon.png 27 December, 2024 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్జున్ అదుర్స్

08-11-2024 01:07:22 AM

చెన్నై: తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసుకున్నాడు. గురువారం జరిగిన మూడో రౌండ్‌లో రష్యాఅలెక్సి సరానాను ఓడించిన అర్జున్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లోనూ రెండో స్థానానికి దూసుకెళ్లాడు.

మూడు రౌండ్లు ముగిసేసరికి అమిన్ తబటబెయితో సమంగా లీడ్‌లో కొనసా గుతున్నాడు. 2800 ఎలో రేటింగ్ పాయిం ట్లు కలిగిన అర్జున్ ర్యాంకింగ్స్‌లో ఫాబియానొ కరునాను అధిగమించాడు. మిగి లిన మ్యాచ్‌లో అమిన్ తబటబెయి, లెవన్ అరోనియన్ విజయాలు సాధించగా.. భారత గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతీ, ఆర్. వైశాలీ ఓటమి పాలయ్యారు.