- ఈనెల 20న శిక్ష ఖరారు
- భారీ భద్రత మధ్య తీర్పు
- కన్నీటి పర్యంతమైన బాధితురాలి తండ్రి
కోల్‌కతా, జనవరి 18: దేశవ్యాప్తంగా సం చలనం సృష్టించిన ఆర్జీకర్ మెడికల్ కాలేజీ వైద్యురాలి హత్యాచార ఘటనలో శనివారం కోల్‌కతాలోని సీల్దా కోర్టు తీర్పు వెలువరించింది. సీబీఐ సమర్పించిన ఆధారాల ప్రకా రం నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్‌ని దోషిగా తేల్చింది. సంజయ్ రాయ్‌ని దోషిగా అయితే తేల్చింది కానీ అతడికి మాత్రం ఇం కా శిక్షను ఖరారు చేయలేదు. సోమవారం రోజున శిక్షను ఖరారు చేయనున్నట్లు తెలిపింది. సంజయ్ రాయ్ మీద సెక్షన్ 64 (రే ప్), సెక్షన్ 66 (మరణానికి కారణం), సెక్షన్ 103 (హత్య) కింద చార్జిషీట్ దాఖలైంది.
ఏ శిక్ష పడొచ్చు?
భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సెక్షన్ 64 (1) ప్రకారం ఎవరైతే అత్యాచారానికి పాల్పడుతారో వారికి కఠిన కారాగార శిక్ష విధించబడుతుంది. ఈ శిక్ష 10 సంవత్సరాల కంటే తక్కువ ఉండరాదు. ఒక్కో సందర్భంలో ఇది జీవి త ఖైదుగా కూడా మారే అవకాశం ఉం టుంది. ఒక్కోసారి శిక్ష జరిమానా రెండూ పడే అవకాశం ఉంది.
సెక్షన్ 66 ప్రకారం.. ఎవరైతే సెక్షన్ 64 ప్రకారం దోషిగా తేలుతారో.. ఒక స్త్రీ మీద అత్యాచారం చేసి ఆమె మరణానికి లేదా ఆమె వైకల్యానికి కారణం అవుతారో అటువంటి వారికి కఠిన కారాగార శిక్ష విధించబుతుంది. 20 సంవత్సరాల కంటే తక్కువ కాకుండా శిక్ష ఉంటుంది. జీవిత ఖైదు కూడా విధించొచ్చు.
సెక్షన్ 103 (1) ప్రకారం.. ఎవరైతే వ్యక్తి మరణానికి కారణం అవుతారో వారికి ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. జరిమానా కూడా పడొచ్చు.
ఏం జరిగిందంటే..
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆగ స్టు 9 2024న ఆర్జీకర్ ఆసుపత్రిలోని సెమినార్ హాలులో ట్రెయినీ వైద్యురాలి శవం లభించింది. ఆమెను అత్యాచారం చేసి తర్వా త హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఆసుపత్రిలో సివిక్ వాలంటీర్‌గా విధులు నిర్వర్తి స్తున్న సంజయ్ రాయ్ అనే వ్యక్తి నేరం చేసినట్లు పోలీసులు తేల్చారు.
సీసీటీవీ పుటేజీల ఆధారంగా సంజయ్‌ని దోషిగా గుర్తిం చారు. చాలా పరిణామాల తర్వాత ఈ కేసు సీబీఐకి బదిలీ అయింది. తీర్పు సందర్భంగా కోర్టు వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మో హరించారు. దోషిగా తేలిన సంజయ్ రాయ్ మాట్లాడేందుకు సోమవారం అనుమతిస్తామని జడ్జి తెలిపారు.
162 రోజులు.. 120కి పైగా వాంగ్మూలాలు
కోల్‌కతా ఘటన జరిగి దాదాపు 162 రోజులు పూర్తయింది. 162 రోజుల తర్వాత కోర్టు నిందితుడిని దోషిగా తేలుస్తూ తీర్పు ను వెలువరించింది. సీబీఐ దర్యాప్తులో భా గంగా 120 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. నిందితుడి మెడ లో ఉన్న బ్లూటూత్ ఆధారంగా సీసీ కెమెరా ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
నేను విన్నాను..
ఆర్జీకర్ ఘటనలో తీర్పు వెలువరించే సమయంలో జడ్జి మాట్లాడుతూ.. ‘నేను అన్ని సాక్ష్యాలు, ఆధారాలను పరిశీలించాను. అందరి వాదనలు విన్నాను. ఈ మొత్తం విన్న తర్వాత నిన్ను దోషిగా నిర్దారిస్తున్నాను. నీకు తప్పకుండా శిక్ష పడాలి’ అని అన్నారు. బాధితురాలి తల్లిదండ్రులు తీర్పు వెలువరించిన తర్వాత కన్నీటి పర్యంతం అయ్యారు.