calender_icon.png 19 April, 2025 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరి థీమ్‌సాంగ్ ఆ రోజే..

03-04-2025 12:00:00 AM

‘పేపర్‌బాయ్’ ఫేమ్ డైరెక్టర్ జయశంకర్ వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల నిర్మిస్తున్నారు. మనిషి ఎలా బతకకూడదన్న విషయాన్ని ఈ సినిమా ద్వారా ఆసక్తికరంగా చూపించనున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ‘బ్యాడ్ ఈజ్ న్యూ గుడ్’ అనే క్యాప్షన్‌తో ఆరంభం నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా చేస్తున్న.

ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ఓ అప్‌డేట్‌ను ఇచ్చింది. ఈ మూవీ థీమ్ సాంగ్‌ను ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అనసూయ భరద్వాజ్, సాయికుమార్, సుమన్, ఆమని, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాసరెడ్డి, చమ్మక్‌చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శివశంకర వరప్రసాద్; సంగీతం: అనుప్ రూబెన్స్; రచనాదర్శకత్వం: వీ జయశంకర్.