మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాం తి): పీఏసీ చైర్మన్‌గా అరికెపూడి గాంధీ నియామకం ప్రజాస్వామ్య విరుద్ధమని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కాంగ్రెస్ సూచించిన వారికే కేసీఆర్ పీఏసీ చైర్మన్‌గా నియమించారన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ..
హరీశ్‌రావు నామినేషన్‌ను ఎందుకు తిరస్కరించారని తాము ప్రశ్నిస్తే ఓర్వలేకపోతున్నారని, ఇప్పటికైనా ప్రతిపక్షనేత కేసీఆర్ సూచన మేరకు హరీశ్‌రావును పీఏసీ చైర్మన్‌గా నియమించాలని డిమాండ్ చేశా రు. అరికెపూడి గాంధీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అని మంత్రి శ్రీధర్‌బాబు హాస్యాస్పదమన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అధిష్ఠానానికి లేఖ రాసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ బల్డో జర్ పాలిటిక్స్: ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్
అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బుల్డోజ్ పాలిటిక్స్ చేస్తోందని, అరికెపూడి గాంధీని పీఏసీ చైర్మన్‌గా అక్రమంగా నియమించారని సత్యవతి రాథోడ్ విమర్శించారు. పీఏసీ చైర్మన్‌గా ఎవరు ఉండాలో నిర్ణయిం చే అధికారం ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ ప్రజాస్వామ్య సూత్రాలకు ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందన్నారు. పీఏసీ చైర్మన్ పదవి కీలకమని, ప్రభుత్వం చేసిన ఖర్చులపై పీఏసీలో చర్చ జరుగుతుందన్నారు.