calender_icon.png 31 March, 2025 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ను కలిసిన అరిగెల

28-03-2025 06:35:55 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్యను శుక్రవారం బీజేపీ సీనియర్ నాయకుడు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి, శాలువాతో సన్మానించారు. జిల్లాలో నెలకొన్న కొన్ని సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. వీరి వెంట పార్టీ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు మాటూరి జయరాజ్, నాయకులు రేగుంట ప్రవీణ్ కుమార్, ముషీర్, తదితరులు ఉన్నారు.