హైదరాబాద్: అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో శుక్రవారం సాయంత్రం విచారణ ప్రారంభం అయింది. తనపై నమోదైన కేసు కొట్టేయాలని అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ వేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు ఉన్నారు. 9వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ ముందు అల్లు అర్జున్ ను పోలీసులు హాజరుపర్చారు. క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. హైకోర్టు తీర్పు వచ్చాకే నాంపల్లి కోర్టు రిమాండ్ పై స్పష్టత వచ్చే అవకాశముంది. పోలీసులు తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని సంధ్య థియేటర్ తరుఫు న్యాయవాది వాదించారు. డిసెంబర్ 4న పుష్ప-2 సినిమా ప్రదర్శన సందర్భంగా సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.