calender_icon.png 30 September, 2024 | 10:53 AM

ఇండ్ల స్థలాల కోసం వాగ్వాదం

29-09-2024 12:16:10 AM

పట్టాలు ఇచ్చి 20 ఏళ్లు 

స్థలాలు చూపని అధికారులు

గుడిసెలు వేసేందుకు సిద్ధమైన ఎస్సీలు

అడ్డుకున్న బీసీలు.. ఉద్రిక్తత

కామారెడ్డి, సెప్టెంబర్ 28 (విజయక్రాం తి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం  చిట్యా ల గ్రామంలో ఇండ్ల నిర్మాణం కోసం 20 సంవత్సరాల క్రితం 60 మంది ఎ స్సీల కు, 80 మంది బీసీ లబ్ధిదారులకు అధికారు లు పట్టాలు ఇచ్చారు. కానీ స్థలాలను చూప లేదు.

దీంతో గత 20 ఏళ్లుగా స్థలం విషయమై గ్రామంలో వివాదం కొనసాగుతున్న ది. పట్టాలకు సంబంధించిన ఖాళీ స్థలంలో కొంతమంది ఎస్సీలు గుడిసెలు వే సుకునేందుకు శనివారం కొందరు ఎస్సీలు వెళ్లారు. విషయం తెలుసుకున్న బీసీ లబ్ధిదారులు అ క్కడకు వెళ్లి గుడిసెలు వేయకుండా అడ్డుకు న్నా రు.

ఇండ్ల స్థలాలు కేటాయించకుండా గుడిసెలు వేయొద్దని చెప్పడంతో ఇరువర్గా ల మధ్య ఘర్షన వాతావరణం చోటు చేసుకున్నది. విషయం తెలుసుకున్న తాడ్వాయి పోలీసులు చిట్యాల గ్రామానికి చేరుకుని ల బ్ధిదారులతో మాట్లాడారు. ఎస్సై వెంకటేశ్వ ర్లు, తహసీల్దార్ రహీముద్దీన్ గ్రామసభను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా అందరి ఇండ్లు ఒకే చోట కలిపి నిర్మించాలని ఒక వర్గ ం, వేర్వేరుగా నిర్మించాలని మరో వర్గం వా రు కోరారు. ఉన్నతా ధికారులకు నివేదిస్తామని, అప్పటి వరకు ఎవ రు కూడా ఇంటి నిర్మాణాలు చేపట్టవద్దని సూచించడంతో వివాదం సద్దుమణిగింది.