calender_icon.png 15 November, 2024 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం

31-08-2024 03:31:42 AM

మేడ్చల్, ఆగస్టు 30: మేడ్చల్‌లో శుక్రవారం చేపట్టిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మేడ్చల్, గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలకు చెందిన 80 మందికి కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి పంపిణీ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే వెళ్లిపోయిన తర్వాత కాంగ్రెస్ నాయకులు అక్కడకు వచ్చి అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్‌చార్జి లేకుండా ఎలా పంపిణీ చేస్తారని బీఆర్‌ఎస్ నాయకులను ప్రశ్నించారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. అధికారులను అడగాలని బీఆర్‌ఎస్ నాయకులు బదులిచ్చారు. కాంగ్రెస్ నాయకులు డిప్యూటీ తహసీల్దార్ సునీల్ కుమార్‌ను అడుగగా.. తాము లబ్ధిదారులకు మాత్రమే సమాచారమిచ్చామని ఆయన బదులిచ్చారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబుకు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.