calender_icon.png 19 January, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెమీస్‌లో అర్జెంటీనా

06-07-2024 12:05:00 AM

  • పెనాల్టీ షూటౌట్‌లో ఈక్వెడార్‌పై విజయం
  • కోపా అమెరికా కప్

డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అర్జెంటీనా కోపా అమెరికా కప్‌ను రికార్డు స్థాయిలో 16వసారి కైవసం చేసుకునేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచింది. ఈక్వెడార్‌తో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ ఫైనల్లో పెనాల్టీ షూటౌట్ ద్వారా థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసిన అర్జెంటీనా వరుసగా ఐదోసారి కోపా అమెరికా కప్ సెమీస్‌లో అడుగుపెట్టింది. 

హౌస్టన్ (టెక్సస్):  కోపా అమెరికా కప్‌లో హాట్ ఫేవరెట్ అర్జెంటీనా సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం క్వార్టర్ ఫైనల్లో మొదట స్కోరు 1 సమం కాగా.. విజేతను తేల్చేందుకు నిర్వహించిన షూటౌట్‌లో అర్జెంటీనా 4  ఈక్వెడార్‌పై విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో అర్జెంటీనా తొలి అర్థభాగంలోనే ఖాతా తెరిచింది. ఆట 35వ నిమిషంలో లిసాండ్రో మార్టినేజ్ గోల్ కొట్టి అర్జెంటీనాను 1 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఈక్వెడార్ పలు మార్లు గోల్‌పోస్టులపై దాడి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. రెండో అర్థభాగంలోనూ అర్జెంటీనా ఢిపెన్స్ ముందు ఈక్వెడార్ నిలబడలేకపోయింది. మ్యాచ్ ఇక అర్జెంటీనాదే అనుకుంటున్న తరుణంలో ఈక్వెడార్ తరఫున కెవిన్ రోడ్రిగేజ్ (90+1వ నిమిషంలో) గోల్ సంధించాడు. ఇరుజట్ల స్కోర్లు 1 సమం అయ్యాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది.

షూటౌట్ సాగిందిలా..

పెనాల్టీ షూటౌట్‌లో తొలుత అర్జెంటీనా తరఫున మెస్సీ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించడంలో విఫలమయ్యాడు. మెస్సీ కొట్టిన బంతి క్రాస్‌బార్‌కు తగిలి దూరంగా వెళ్లింది. ఆ తర్వాత అర్జెంటీనా తరపున జులియన్ అల్వారెజ్, అలెక్సిస్ మాక్ అలిస్టర్, గొంజాలో మోంటియెల్, నికోలస్ ఒటామెండీలు బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించడంలో విజయవంతమయ్యారు. ఈక్వెడార్ తరఫున జోర్డీ కాసిడో, అలెగ్జాండర్ డోమిన్‌గేజ్‌లు మాత్రమే బంతిని గోల్ పోస్ట్‌కు తరలించారు. పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా విజయం సాధించడంలో ఆ జట్టు గోల్‌కీపర్ ఎమిలియానో మార్టినేజ్ మరోసారి కీలకపాత్ర పోషించాడు. లీగ్ దశలో పెరూతో జరిగిన చివరి మ్యాచ్‌కు దూరంగా ఉన్న మెస్సీ ఈక్వెడార్‌తో మ్యాచ్‌లో ఆట 45వ నిమిషంలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సమయంలో అతడికి స్టేడియం నుంచి స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. ఇప్పటివరకు 15 సార్లు కోపా కప్ నెగ్గిన అర్జెంటీనా సెమీఫైనల్లో వెనుజులా, కెనడా మధ్య విజేతతో తలపడనుంది.