calender_icon.png 31 October, 2024 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా

27-06-2024 05:14:22 AM

ఈస్ట్ రూథర్‌ఫోర్డ్ (అమెరికా): కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. గ్రూప్ భాగంగా బుధవారం జరిగిన పోరులో అర్జెంటీనా 1 చిలీని చిత్తుచేసింది. మ్యాచ్ ఆసాంతం ఆధికయ కనబర్చిన అర్జెంటీనా తరఫున మార్టినేజ్ (88వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. గ్రూప్ దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన అర్జెంటీనా మరో పోరు మిగిలుండగానే నాకౌట్‌కు అర్హత సాధించింది. మ్యాచ్‌లో అధిక శాతం బంతిని తమ అధీనంలోనే పెట్టుకున్న అర్జెంటీనా ప్లేయర్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై తొమ్మిది సార్లు దాడి చేయగా.. చిలీ స్ట్రయికర్‌లు మూడింటికే పరిమితమయ్యారు. అర్జెంటీనా సారథి మెస్సీ మైదానంలో పాదరసంలా కదులుతూ సహచరులకు పాస్‌లు అందించాడు.