కరీంనగర్: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సంచలమైన తీర్పించింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమర్ధనీయమని దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేయడం పట్ల మాజీ శాసనసభ్యులు మానకొండూర్, మాజీ ప్రభుత్వ విప్ ఆరేపల్లి మోహన్ హర్షం వ్యక్తం చేశారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఎస్సి, ఎస్టీ వర్గీకరణ అవసరమని జస్టిస్ చంద్ర చూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో ఆరు నిష్పత్తి 1 తీర్పు వెలువరించినారు. ఇప్పటివరకు ఎస్సీ వర్గీకరణ కొరకు పోరాటం చేసిన నాయకుల యొక్క ఆకాంక్ష మేరకు లేదా వర్గీకరణ ద్వారా అన్ని వర్గాలకు లాభమైతదని ఆలోచన చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని పేర్కొన్నారు.
ఇట్టి జడ్జిమెంట్ ఆధారంగా ఆయా రాష్ట్రాలు తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసి ఆయా ఉపకులాలకు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఒక న్యాయవాదిగా మాజీ శాసనసభ్యుడుగా ఒక సామాజిక దృక్పథం ఉన్న వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నట్టు తెలిపారు. సర్వోన్నతమైన న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తప్పక మనదేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి తద్వారా ఎస్సీ ఎస్టీల్లో ఉన్న ఉపకులాలన్నిటికీ(మాల, మాదిగ, మాస్తి, సింది, దక్కలి,) ఇలాంటి ఉప కులాలకు సమాన న్యాయం చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.