28-02-2025 12:15:15 AM
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 27(విజయక్రాంతి): మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా కొత్తగూడా మార్తాండ్ నగర్ కాలనీలలో గల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పరమేశ్వరునికి అభిషేకం చేసిన పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహా శివరాత్రి పర్వదినం అతి పవిత్ర దినం.
శివుడికి అత్యంత ఇష్టమైన రోజు, శివరాత్రి రోజున వాడ వాడల రోజువారీ ఉపవాస దీక్షలతో జాగారంతో వేడుక చేసుకుంటారు. మహా శివరాత్రి ప్రజలందరిపై దేవుని కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ప్రార్థిస్తూ.. మహాశివుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ సమస్త భక్త జనకోటికి మహా శివరాత్రి పర్వదినం శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భక్తులు పాల్గొన్నారు.