హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. కౌశిక్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేరుకున్నారు. పోలీసులు అరికెపూడిని అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. కౌశిక్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కౌశిక్‌రెడ్డి ఇంటి బయట అరికెపూడి గాంధీ అనుచరుల ధర్నాకు దిగారు. గాంధీ అనుచరులు కౌశిక్‌రెడ్డిపై రాళ్లు, గుడ్లు, టమాటాలతో దాడి చేశారు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ద్వంసం అయ్యాయి. కౌశిక్ రెడ్డి ఇంట్లోని పూలకుండీలను కార్యకర్తలు ధ్వంసం చేశారు. కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద అరెకపూడి గాంధీ అనుచరులతో ధర్నాకు కూర్చున్నారు. కౌశిక్‌రెడ్డి దమ్ముంటే బయటకు రావాలి నేను ఇక్కడే ఉంటానని అరెకపూడి గాంధీ సవాల్ చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోంది.. అరికెపూడి గాంధీ బీఆర్ఎస్‌లో ఉంటే.. గులాబీ కండువా కప్పుకోవడానికి అభ్యంతరం ఏంటి? అని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు.