calender_icon.png 4 April, 2025 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏప్రిల్ నెల బొగ్గు ఉత్పత్తిపై సమీక్ష ఏరియా జిఎం శాలెం రాజు

04-04-2025 12:31:16 AM

 కొత్తగూడెం,ఏప్రిల్ 3 (విజయ క్రాంతి):  ఏరియా గత ఆర్థిక సంవత్సరంమునకు (2024-25) గాను కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 143.50 లక్షల టన్నులు (వీకేఓసి కు నిర్దేశించిన లక్ష్యాన్ని మినహాయింపు చేసి) గాను 144.18 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని 100.5% సాధించినట్లు ఏరియా జి ఎం శాలెం రాజు తెలిపారు.

గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఉత్పత్తి సాధనలో ప్రధాన పాత్ర పోషించిన జే.వి.ఆర్ ఓసి ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 112 లక్షల టన్నులకు గాను 114.58 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని రక్షణతో సాధించి సింగరేణి సంస్థకు పెద్దన్న పాత్ర పోషిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

ఇదే స్ఫూర్తితో రానున్న ఆర్థిక సంవత్సరాలలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ సింగరేణి అభివృద్ధిలో ముందు వరుసలో నిలవాలి కోరారు l. భవిష్యత్తులో ఇంకా ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించాలని, ప్రతి ఒక్కరి సహకారం వల్లే ఇంతటి విజయాన్ని అందుకున్నామన్నారు.రోడ్డు మార్గం ద్వారా 17.23 లక్షల టన్నులు , రైల్ మార్గం ద్వారా 145.16 లక్షల టన్నులు మొత్తంగా 162.39 లక్షల టన్నులు బొగ్గు రవాణా జరిగినదన్నారు.

విధముగా రానున్న ఆర్థిక సంవత్సరమునకు (2025-26) గాను పద్మావతి ఖని మైన్ కు 2.5 లక్షల టన్నులు, జే.వి.ఆర్. ఓసి .II ప్రాజెక్ట్ కు 116.00 లక్షల టన్నులు, కిష్టారం ఓసిమ ప్రాజెక్ట్ కు 28.00 లక్షల టన్నులు అలాగే నూతనంగా అనుమతులు పొందిన వి.కే.ఓసిపకి 10.00 లక్షల టన్నులు గా నిర్ణయించి మొత్తంగా కొత్తగూడెం ఏరియా కు 156.50 లక్షల టన్నులను లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు.

నూతనంగా అనుమతులు పొందిన వి.కే.ఓసిఉ ప్రాజెక్ట్ నుండి బొగ్గు ఉత్పత్తి రానున్న మూడు నెలలలో ప్రారంభించేలా సంబంధిత అదికారులతో ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.ఈ ప్రెస్ మీట్ ద్వారా జిఎం శాలెం రాజు తెలియజేశారు.  విజయానికి సహకరించిన,ప్రతి ఒక్క అధికారికి, యూనియన్ ప్రతినిధులకు, కాంట్రాక్ట్ కార్మికులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు