మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని ఏరియా జిఎం దుర్గం రామచందర్ సోమవారం రూ 1.74 కోట్ల విలువగల టిఐఎల్ కంపెనీకి చెందిన భారీ క్రేన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ క్రేన్ ను మణుగూరు ఓసికి కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రేన్ ద్వారా మణుగూరు ఓసి మరింత శక్తివంతమైనదిగా మారిందన్నారు. యంత్రాల వినియోగ సమయాన్ని పెంచాలని తద్వారా మణుగూరు ఏరియాకు యాజమాన్యం నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 126.7 లక్షల టన్నులను సాధించాలన్నారు. కార్యక్రమంలో డీజీఎం సివిల్ వెంకటేశ్వర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాస చారి, అధికారులు రామారావు తదితరులు పాల్గొన్నారు.