మణుగూరు,(విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని సి టైప్ కాలనీలో ప్లంబర్ గా పనిచేస్తున్న కార్మికుడికి ఏరియా జీఎం దుర్గం రామచందర్(Area GM Durgam Ramchander) చేతుల మీదుగా శనివారం ఆర్థిక సహాయాన్ని అందించారు. సి టైప్ బంగ్లాస్ ఏరియా కాలనీలో ప్లంబర్గా పనిచేసే వెంకట్ నారాయణ కు కొంతకాల క్రితం చేతివేళ్ళకు గాయాలయ్యాయి. వైద్య చికిత్సల నిమిత్తం కాలనీలోని అధికారులు కాంట్రాక్టర్ కలసి రూ.16 వేళ్లను వెంకటనారాయణ వైద్య ఖర్చుల నిమిత్తం అందించాలనుకున్నారు. ఈ నగదును జీఎం రామచంద్ర చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం శ్యామ్, ఏజీఎం సివిల్ డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.