calender_icon.png 3 March, 2025 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుస్సాడినే పాదాలేమో ఆడీ ఆడీ అలిసేనే..

02-03-2025 12:45:36 AM

అవినాష్‌వర్మ ఆద్యరెడ్డి, నీలిమ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘జగమెరిగిన సత్యం’. తిరుపతి పాలే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అమృత సత్యనారాయణ క్రియేషన్స్ బ్యానర్‌పై అచ్చ విజయభాస్కర్ నిర్మిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో 1994లో జరిగిన ఒక యధార్థ సం ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు తిరుపతి పాలే.

వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోందని రెండేళ్ల క్రితమే మేకర్స్ ప్రకటించారు. అప్పుడే ఈ మూవీ టైటిల్, మోషన్ పోస్టర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా విడుదల చేయించారు కూడా. అనూహ్యంగా ఈ సినిమా నుంచి తాజాగా ఓ పాటను మేకర్స్ విడుదల చేశారు.

‘సెప్పలేవ పిల్లా ముక్కుసూటిగా.. సూరుడంతటోడే రాయభారమా.. గుండెల్లోన పిల్లంగోవే ఊదీ ఊదీ పాడేలే.. గుస్సాడినే పాదాలేమో ఆడీ ఆడీ అలిసేనే..’ అం టూ సాగుతోందీ పాట. కడలి సత్యనారాయణ గీత సాహిత్యం అందించగా.. సురేశ్ బీ సంగీత సారథ్యంలో శ్రీనివాస్ దరిమిశెట్టి, లక్ష్మీమేఘన ఆలపించారు. ఈ చిత్రానికి డీవోపీ: షోయబ్; కొరియోగ్రఫీ: జిత్తు మాస్టర్.