calender_icon.png 16 November, 2024 | 3:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పసుపు వాడుతున్నారా.. జర జాగ్రత్త

14-11-2024 12:00:00 AM

భారతీయ మహిళలు పసుపును అనేక రకాలుగా వాడుతుంటారు. ఇది ఆహార పదార్థాల్లోనే కాకుండా సహజ సౌందర్యంగానూ ఉపయోగపడుతుంది. అయితే ఇటీవల అధ్యయనం ప్రకారం.. భారతదేశం, నేపాల్, పాకిస్తాన్‌లో విక్రయించే పసుపులో అధిక సీసం ఉన్నట్టు గుర్తించారు నిపుణులు. ఒక్కో మోతాదుకు గ్రాముకు 1,000 మైక్రోగ్రాములు మించిపోయినట్టు కనుగొన్నారు. అధిక సీసం ఎముకలలో పేరుకుపోయి శరీరంలో ముఖ్యభాగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.

ప్యాక్ చేసిన బ్రాండెడ్ ప్యాకెట్లలో తక్కువ సీసం సాంద్రత ఉంటాయి. సీసంతో పసుపును కలుషితం చేయడం చట్టవిరుద్ధం కానప్పటికీ, పిల్లలకు తీవ్ర హాని కలిగిస్తుంది. తెలివితేటలు, ప్రవర్తనా సమస్యలు, ఎదుగుదల లాంటి సమస్యలతో ముడిపడిఉంది. ప్రపంచవ్యాప్తంగా 800 మిలియన్లకు పైగా పిల్లల్లో సీసం స్థాయిలు ఉన్నట్టు పలు సర్వేలో తేలింది. కాబట్టి మార్కెట్లో దొరికే పసుపుకు బదులు సహజమైనవి వాడాలని సూచిస్తున్నారు.