calender_icon.png 4 January, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాస్మటిక్స్ వాడుతున్నారా!

08-07-2024 12:00:00 AM

అందంగా కనిపించాలనే తాపత్రయంతో ఖరీదు లెక్క చేయకుండా చాలా ఉత్పత్తులే కొంటుం టాం. కానీ, వాటిని ఎప్పటివరకూ వాడా లి? ఎలా వాడాలి? అనే విషయాలు తెలుసుకోకపోతే చిక్కులు తప్పకపోవచ్చు. అందుకోసం కొన్ని సూచనలు..

కాస్మెటిక్స్: మేకప్ ఉత్పత్తులు ఏవైనా చర్మం, కళ్లు, పెదాలు వంటి సున్నిత భాగాలపై రాస్తాం కాబట్టి తప్పనిసరిగా నాణ్యమైన రకాల్ని ఎంచుకోవాలి. కొనే ముందు ఆయా ఉత్పత్తుల గడువు తేదీలను మార్కర్‌తో సీసాలపై రాసుకోవాలి. 

ఫౌండేషన్: సాధారణంగా దీన్ని ఆరు నెలల నుంచి ఏడాది వరకూ వాడుకోవచ్చు. అది పొడారకుండా, లోపలికి సూక్ష్మక్రిములు చేరకుండా ఉండాలంటే.. చేతులతో తాకకూడదు. కావాల్సినంత ఫౌండేషన్‌ని కొద్దిగా చేతిపై మీద వేసుకొని వాడుకోవాలి. మూత టైట్‌గా పెట్టాలి. 

లిప్‌స్టిక్: లిప్‌స్టిక్, లిప్‌లైనర్, గ్లాస్ వీటి జీవితకాలం ఏడాదే. ఇవి పోడిబారినట్లు కనిపిస్తుంటే పాడవుతున్నాయని గుర్తించాలి. ఫ్రిజ్‌లో ఉంచి వాడుకుంటే త్వరగా ఆరిపోవు. 

ఐబ్రో పెన్సిల్: కాటుక, ఐబ్రో పెన్సిల్ కళ్ల అందాన్ని రెట్టింపు చేసే వీటిని సంవత్సరం వరకూ వాడుకోవచ్చు. పెన్సిళ్లను ఎప్పటికప్పుడు చెక్కుతాం కనుక వాటితో ఏ సమస్యా ఉండదు. కాటుకను పెట్టేటప్పుడు తప్పనిసరిగా చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. మూతలు ఊడిపోకుండా చూసుకోవాలి. లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. 

మస్కారా: మూడు నెలలకే దీని జీవితకాలం ముగుస్తుంది. దీన్ని ఇతరులతో పంచుకోవడం మానేయాలి. మూడు నెలలు కాగానే మస్కారా ఇంకా ఉన్నా.. కొత్తది కొనుక్కోవడం వల్ల కంటి ఇన్ఫెక్షన్లు రాకుండా జాగ్రత్తపడొచ్చు. 

నెయిల్ పాలిష్: దీన్ని ఏడాది నుంచి రెండేళ్ల వరకూ వాడుకోవచ్చు. పెచ్చులుగా ఊడుతున్నా, తరచూ గడ్డకడు తున్నా.. వాడకపోవడమే మేలు. దీన్ని కూడా ఫ్రిజ్‌లో ఉంచితే సరి.