వెచ్చదనం కోసం రూమ్ హీటర్లను ఉపయోగిస్తున్నారా? అయితే వాటివల్ల కలిగే నష్టాలేమిటి? వాటిని ఎలా వాడాలి అనే విషయాలను తెలుసుకుందాం..
* హీటర్ల కారణంగా గదిలోని తేమ శాతం తగ్గుతుంది. ఇది శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల చర్మం పొడిబారడం, దురద తదితర సమస్యలు వస్తాయి. గదిలో తేమ లేకపోవడం వల్ల శ్వాసపై ప్రభావం చూపడమే కాకుండా ఉబ్బసం వంటి సమస్యలు తలెత్తుతాయి.
* కొన్ని హీటర్లు కార్బన్ మోనాక్సెడ్‌ను విడుదల చేస్తాయి. దీనివల్ల తలనొప్పి, వికారం వంటి సమస్యలు పెరిగిపోతాయి. గదిలో సరై న వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. అలాగే కార్బన్ మోనాక్సైడ్ డిటెక్టర్‌లను వినియోగించాలి.
* కొన్ని రకాల హీటర్లు ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. దీనివల్ల చర్మ సమస్యలతో పాటూ కళ్లు పొడిబారటం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే హీటర్‌ను ఆఫ్ చేయాలి. అలాగే నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి.
* ఆస్తమా లేదా శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉంటే రూమ్ హీటర్లు వినియోగించకూడదు. దీనివల్ల గదిలో ఆక్సిజన్ స్థాయి తగ్గవచ్చు. ఇది శ్వాస సమస్యలకు దారి తీస్తుంది.
* రూమ్ హీటర్ ఉపయోగించినప్పుడు గదిలోని గాలిలో తేమ శాతం తగ్గిపోకుండా ఉండాలంటే ఒక బకెట్ నీటిని గదిలో ఒక మూలకు ఉంచితే సరిపోతుంది.