తల్లిదండ్రుల తీరు, కుటుంబ వాతావరణంపైనే పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుందంటారు. అందుకే వారి ముందు వాదులాడుకోవడం, అబద్దాలు చెప్పడం చేయకూడదంటున్నారు మానసిక నిపుణులు. ప్రతి కుటుంబంలో, సంసారంలో కోపతాపాలు, గొడవలు ఉంటాయి. వాటిని పిల్లల ముందు ప్రదర్శించడం, ఒకరినొకరు నిందించుకోవడం చెయ్యకూడదు.
ఆ కోపంలో మాట తూలే అవకాశం ఉంది.. అది పిల్లల మనసులపై చాలా ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి పిల్లల ముందు వాదులాడుకోకుండా ఉండటానికి ప్రయత్నించాలి. అలాగే తరచూ మనం మాట మార్చడం వల్ల పిల్లలకు అబద్దాలు చెప్పడం అలవాటవుతుంది. అలాగే పిల్లల్ని దేనికైనా ఒప్పించడానికి ఒట్టు వేయడం మీకు అలవాటైతే దాన్ని మార్చుకోండి. ప్రేమ, ఆప్యాయత, నమ్మకం వంటివి సహజంగా రావాలి. లేదంటే ఇలా ఒట్టేయడాన్ని ఆయుధంగా చేసుకుని భావోద్వేగాలతో మిమ్మల్ని కట్టిపడేసే ప్రమాదం ఉంది. అది భవిష్యత్తులో ప్రమాదంగా మారుతుంది.