calender_icon.png 11 February, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస చేస్తున్నారా స్వామీ?

11-02-2025 12:44:43 AM

  1. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు..
  2. గురుకులాలకు వెళ్లని అధికారులపై ఇంటెలిజెన్స్ నజర్

హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): గురుకులాలు, వసతి గృహాల్లో బసచేసి అక్కడి సమస్యలను తెలుసుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఆఫీసర్లు పాటిస్తున్నారా? లేదా? రిపోర్టు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటెలి జెన్స్ వర్గాలను ఆదేశించారు. కొందరు ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న సమాచారంతో ఈ అంశాన్ని సీఎం సీరియస్‌గా తీసుకున్నారు. 

గురుకులాల్లో ఇప్పటివరకు బస చేసిన అధికారులు ఎవరు? ఒకసారి కూడా తనిఖీలకు వెళ్లనివారెవరు? అనే అంశాలపై రిపోర్టు ఇవ్వాలని తాజాగా ఇంటెలిజెన్స్‌ను సీఎం ఆదేశించారు. గురుకులాలతో పాటు ప్రభుత్వ వసతి గృహాల్లో పలవురు విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రుల్లో చేరిన పలు ఉదంతాలు ఇటీవల చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలు రాష్ట్రంలో రాజ కీయంగా కూడా ప్రకంపనలు రేపాయి.

ఈ క్రమంలో గురుకు లాలపై నిరంతరం పర్వవేక్షణతో పాటు సమస్యల పరిష్కారంపై సీఎం ఫోకస్ పెట్టారు. దీంతో ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీలు, సర్కారు స్కూల్స్‌లో 15 రోజులకోసారి బస చేసి అక్కడ సమస్యలను గుర్తించాలని జనవరి 1న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆఫీసర్లు హాస్టల్స్‌లో సందర్శించి మెనూ అమలు, విద్య, పారి శుద్ధ్యం, ఇతర మౌలి క వసతులను తనిఖీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

15 రోజులకు ఒకసారి కలెక్టర్లు కానీ, అదనపు కలెక్టర్లు వసతి గృహాలను సందర్శించి రిపోర్టును తయారు చేస్తారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమై తనిఖీల్లో వెలుగుచూసి న సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుం ది. సీఎం సీరియస్‌గా ఉన్నారన్న విషయం తెలుసుకున్న కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు గురు కులాలకు క్యూ కడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉండ గా, ఈ తనిఖీల అంశాన్ని సీఎం స్వయం గా పర్యవేక్షించనున్నారు. గుర్తించిన సమస్యలు ఎన్ని? అందులో ఎన్ని పరిష్కరిం చారు? అన్న అంశాలపై నెలవారీగా నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదే శించి నట్లు సమాచారం. 

ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీలు, సర్కారు స్కూల్స్‌లో అందించే పోషకాహారంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. విద్యార్థులకు ఎలాంటి పోషకాహారం అందించాలి? ఎంతమే రకు అందించాలన్న అంశాలపై జాతీయ సంస్థ అయిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషియన్(ఎన్‌ఐఎన్) సహకారం తీసుకునేందుకు సిద్ధమైంది.