calender_icon.png 27 April, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీకు నచ్చినట్టే ఉంటున్నారా!

20-04-2025 12:00:00 AM

ఇలా ప్రవర్తించవద్దు.. అలా మాట్లాడవద్దు.. ఇలా ఆలోచించవద్దు అని ఇతరులు మీకు సలహాలు ఇస్తుంటే వాటిని అంతగా పట్టించుకోవద్దని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సొంత నిర్ణయాలు, ఆలోచనలు ఉంటాయి. వాటిని అనుసరించే ముందుకు సాగాలి. ఇతరుల్ని ఫాలో అయితే మీ సొంత గుర్తింపును కోల్పోయే ప్రమాదముంది. ఇతరుల కోసం ప్రతి రోజూ మిమ్మల్ని మీరు మార్చుకుంటూపోతే.. చివరికి మిగిలేది ఏముండదు. ప్రపంచానికి భిన్నంగా ఉండటం, మీ గుర్తింపును కాపాడుకోవడం ఏ మాత్రం తప్పు కాదని చెబుతున్నారు మానసిక నిపుణులు. 

* ప్రతి వ్యక్తికి పర్సనల్ స్పేస్ ఉంటుంది. కొన్ని సీక్రెట్స్ దాచడంతో పాటు ఒంటరిగా గడిపే హక్కు ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని పదే పదే నియంత్రించడానికి ప్రయత్నిస్తుంటే వారికి దూరంగా ఉండటమే మేలు. వేరే వాళ్లు మీరు చేసే ప్రతి పనిలో జోక్యం చేసుకుంటుంటే అది ఏ మాత్రం సరైనది కాదని గమనించుకోవాలి. మీ పర్సనల్ స్పేస్‌ని గౌరవించు కోండి. మీ వ్యక్తిగత జీవితంలో దూరవద్దని స్పష్టంగా చెప్పేయండి. 

* ఎవరైనా సరే, మీతో సంబంధం ఉన్నా లేకపోయినా మీ మానసిక ప్రశాంతతను చెడగొట్టే వారికి దూరంగా ఉండటమే మంచిది. కొందరు ఏం కాదు అంతా కరెక్ట్‌గా ఉందని మీ మనసును చిరాకు పెట్టవచ్చు. కాని మీరే సంతోషం లేకుండా దాని ఉపయోగం ఏంటి? అందుకే ప్రతికూల పరిస్థితులు, వ్యక్తుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మీ ఆనందానికి ప్రాముఖ్యత ఇవ్వండి. 

* ఇతరులు ఎల్లప్పుడూ వారి మాటలే వినాలని, వారి కోసమే సమయం కేటాయించాలని భావిస్తారు. అంతేకాకుండా వారి కోరికల ప్రకారం ఇతరులు జీవించాలని కోరుకుంటారు. అయితే వేరేవాళ్లు చెప్పే పనులన్నింటికీ యస్ చెప్పుకుంటూ పోతే మీకు మిగిలేది ఏమీ ఉండదు. సంతోషం, ఆనందం అన్నీ దూరమైపోతాయి. అందుకే ఇతరులకు నో చెప్పడం నేర్చుకోండి.