calender_icon.png 1 April, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతిగా నిద్రపోతున్నారా?

23-03-2025 12:00:00 AM

చాలామంది కాస్త సమయం దొరికితే చాలు ఒక కునుకు తీయాలని చూస్తారు. ఆరోగ్యం బాగుండాలంటే మంచి నిద్ర ఎంతో అవసరం. కొంతమంది సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎంతో బాధపడుతూ ఉంటే.. మరికొందరు ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల కూడా బాధపడుతు న్నారు.

కానీ రోజుకు ఏడు నుంచి తొమ్మిది గంటల కంటే ఎక్కువ నిద్రించే వారికి అనేక రకాల సమస్యలు వెంటాడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అతిగా నిద్ర పోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయట. ఈ సమస్యను హైపోర్సోమ్నియా అని అంటారు. ఎప్పుడైతే నిద్రలో మార్పులు వస్తాయో జీవన విధానం మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అతి నిద్రవల్ల కలిగే ప్రభావాలేంటో చూద్దాం..

* నిద్రలో ఉన్నప్పుడు శారీరక శ్రమ ఉండదు. శరీరం మొత్తం కూడా ఫుల్ రెస్ట్‌లో ఉంటుంది. అందువల్ల నడుము నొప్పి వంటి సమస్యలు ఎదురవుతా యి. అంతేకాదు రోజంతా ఎంతో బద్ధకంగా, నీరసంగా అనిపిస్తుంది. అస్సలు యాక్టివ్‌గా ఉండాలని అనిపించదు. 

* నిద్రలేమి సమస్య వల్ల డిప్రెషన్ ఎక్కువగా వస్తుంటుందని మనకు తెలిసిం దే. అయితే అతినిద్ర వల్ల కూడా డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 15 శాతం మంది అధిక నిద్ర వల్ల డిప్రెషన్ వస్తున్నట్లు ఇటీవల జరిగిన పలు అధ్యాయనాల ద్వారా వెల్లడైంది.

* ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల హృదయ సంబంధిత సమస్యలు, థైరాయిడ్ సమస్యలు వచ్చే అవకా శం ఉంది. బెడ్‌పై ఎక్కువసేపు విశ్రాం తి తీసుకోవడం వల్ల కండరాలు అలసటకు గురవుతాయి.