calender_icon.png 28 October, 2024 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ X దుద్దిళ్ల

16-09-2024 12:35:48 AM

అతి తెలివి చూపిస్తున్నారా?

మీ చిట్టినాయుడూ టీడీపీలోనే ఉన్నాడా?

  1. మా ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పిందెవరు?
  2. మంత్రి శ్రీధర్‌బాబుకు బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ప్రశ్నలు

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గాంధీ, కౌశిక్‌రెడ్డి గొడవ పడితే.. కాంగ్రెస్‌ను విమర్శించడం ఏంటని మంత్రి శ్రీధర్‌బాబు చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘అతి తెలివి మంత్రిగారూ.. మీ చిట్టి నాయుడు కూడా ఇంకా టీడీపీలోనే ఉన్నారా? లేక కాంగ్రెస్‌లో ఉన్నరా?’ అని ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిరిగి కాంగ్రెస్ కండువాలు కప్పింది ఎవరని ప్రశ్నించారు.

ముందు పార్టీలో చేర్చుకోవడం ఎందుకు? తర్వాత పదవులు పోతాయన్న భయంతో ఈ నాటకాలు ఎందుకని ఎద్దేవా చేశారు. అతి తెలివితో హైకోర్టును మోసం చేద్దామనుకుంటున్నారని, కానీ ప్రజలు అన్నీ గమని స్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలపై చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. సిబ్బందికి జీతాలు సకాలం లో ఇవ్వకపోతే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయని నిలదీశారు.

అయోధ్యలో రామాలయం సిబ్బందిపై అత్యాచారం జరిగిందన్న వార్తలపై కూడా కేటీఆర్ స్పందిం చారు. దేశంలో మహిళలకు రక్షణ ఎక్కడుందని బీజేపీపై మండిపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడుసార్లు పాల ధరలను పెంచిందని, హిమా చల్‌లో గంజాయి అమ్మడానికి పర్మిషన్ కావా లని దరఖాస్తు పెట్టుకుందని, తెలంగాణలో వందరోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా డ్రామాలు ఆడుతోందని విమర్శించారు.

మీ ఎమ్మెల్యేలు తన్నుకొంటే మాకేంది?

  1. కాంగ్రెస్‌ను ఎందుకు విమర్శిస్తున్నారు?
  2. బీఆర్‌ఎస్‌పై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఫైర్

మంథని, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తన్నుకొంటే కాంగ్రెస్‌ను విమర్శించటం ఏమిటని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అంతర్గత వ్యవహారాన్ని కాంగ్రెస్‌కు ఎందుకు అంటగడుతున్నారని నిలదీశారు. మంథనిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎవరు తెలివి తేటలు చూపిస్తున్నారు? ఎవరు ఎవరిని రెచ్చగొడుతున్నారో.. ఎందుకిదంత చేస్తున్నారో ప్రజ లు అంతా గమనిస్తున్నారు. మాట మాట్లాడితే అర్థం ఉండాలె. మీరూ పదేండ్లు పాలిం చిన వారే అని మరిచిపోవద్దు.

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అది ప్రజలు నిర్ణయిస్తారు. అధికారం పోయిందని ప్రతి దాన్ని భూతద్దంలో చూడటం వల్ల మీకు మంచి కూడా చెడులానే కనిపిస్తుంది. మీ రాజకీయ కుయక్తులు ప్రజలకు అర్థమైతే చాలు. ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మమ్మల్ని నమ్మి ఓటు వేసిన ప్రజలకు మాత్రమే మేము సమాధానం చెప్పుకుంటాం. మా పాలన మమ్మల్ని చేసుకోనిస్తే బాగుంటుంది’ అని అన్నారు. బీఆ ర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, ఆ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే అరికెపూడిగాంధీ మధ్య వివాదంతో కాంగ్రెస్‌కు సంబంధం లేదని స్పష్టంచేశారు.

తాను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని గాంధీ చెప్పారని, నేనూ అదే విషయాన్ని చెప్పాను తప్ప కొత్తగా ఏమి చెప్పలేదని మంత్రి అన్నారు. ‘ఇతరుల విషయంలో మీరు తలదూర్చినట్లుగా నేను అలా చేయను. మీ పార్టీ అంతర్గత సమస్యలను మీరు పరిష్కరించుకోవాలి. మా పార్టీ పై బురదజల్లే రాజకీయాలు చేయడం ప్రజలంతా చూస్తున్నారు’ అని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఉన్నవారంతా తెలంగాణ వారేన ని, వారి ఆత్మగౌరవాన్ని అందరూ కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడి అంతర్జాతీయ స్థాయిలో ముందుకు తీసుకవెళ్తామని, మా దారికి అడ్డు రాకుండా స్వాగ తిస్తే అందిరకీ మంచిదన్నారు. వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతియాదవ్, పీసీఎస్ చైర్మన్లు కొత్త శ్రీనివాస్, యాదగిరిరావు. నాయకులు సుకేందర్‌రెడ్డి, కాచె శశిభూషన్, చొప్పరి సదానందం పాల్గొన్నారు.