విటమిన్ సి పుష్కలంగా ఉన్న నిమ్మతొక్కల నుంచి టీ తయారు చేసి తాగితే ఆరోగ్యానికి మంచిది. ఈ టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. దీనికోసం ఒక కప్పు నీటిలో నిమ్మతొక్కలు వేసి బాగా మరిగించాలి. తర్వాత ఈ టీలో తేనె కలిపి వేడివేడిగా తాగాలి. ఈ టీ తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇది గొంతు నొప్పి, దగ్గు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. నిమ్మతొక్కలో అధికంగా సిట్రిక్ కంటెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, యాంటీ సెప్టిక్ ఏజెంట్‌గా పని చేస్తుంది.
ఫ్రూట్ కేక్..
బేకింగ్ అంటే ఇష్టమైతే.. కేక్‌లకు నిమ్మతొక్కను కల్పవచ్చు. దీనికోసం నిమ్మతొక్కను పొడి చేయాలి. ఈ తొక్కను ఫ్రూట్ కేక్‌లో ఉపయోగించవచ్చు. ఇది కాకుండా జామ్‌లో కూడా వాడవచ్చు. నిమ్మతొక్క మంచి వాసన కలిగి ఉంటుంది. దీంతో మంచి ఫ్రెషనర్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ తొక్క రిఫ్రెషింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది. ఈ ఫ్రెష్‌నర్‌ను తయారు చేసి ఇంట్లో చల్లుకుంటే మంచి వాసన వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
నిమ్మతొక్కలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంది నిమ్మతొక్కను వాడిన తర్వాత పడేవేస్తారు. కానీ ఈ తొక్క ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉన్న నిమ్మకాయ ఆరోగ్యానికి, చర్మానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. నిమ్మకాయలను వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. నిమ్మతొక్క చర్మానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. నిమ్మతొక్క ఎలా ఉపయోగపడుతుందో.. దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం..