calender_icon.png 2 April, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత కూలర్‌ను మళ్లీ వాడుతున్నారా?

23-03-2025 12:00:00 AM

ఎండాకాలం నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది కూలర్లు ఉపయోగిస్తూ ఉంటారు. అయితే పాత కూలర్‌ను మళ్లీ వాడుతుంటారు. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. 

పాత కూలర్ నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. నీళ్లు బయటికి వస్తున్నచోట ఎంసీల్ పూతలా రాస్తే సమస్య తీరుతుంది.

కూలర్‌ను ఉపయోగించే ముందు దాన్ని శుభ్రం చేయాలి. లోపల ఫ్యాన్‌కు పట్టి ఉన్న బూజు దులిపి రెక్కలను తడి వస్త్రంతో తుడవాలి. ఫ్యాన్‌లో ఏదైనా సమస్య ఉంటే కొత్తదాన్ని తెచ్చి బిగిస్తే సరిపోతుంది.

కూలర్‌కు మూడు వైపులా అమర్చి ఉండే గడ్డి షీట్ల వల్లే గదిలో చల్లదనం విస్తరిస్తుంది. గత ఏడాది వాడిన కూలర్‌ను చాలాకాలం పక్కన పెట్టి ఉంచడం వల్ల వాటిపై దుమ్ము, ధూళి చేరి ఉంటాయి. వీటిని శుభ్రం చేసినప్పటికీ గదిలో చల్లదనం వ్యాపించదు. కాబట్టి కొత్త షీట్స్ తెచ్చి అమర్చుకుంటే తాజా గాలి వీచి ఇల్లంతా చల్లగా ఉంటుంది.

కూలర్ లోపల నీళ్లు నిల్వ ఉండేచోటుని శుభ్రంగా కడగాలి. కూలర్‌ను వాడుతున్నంతకాలం వారానికోసారి తుడవాలి.