- అద్దె చెల్లిస్తామంటూ కార్లు తీసుకొని ఎగనామం పెడుతున్న కిలేడీలు
- రూ.2 కోట్ల 50 లక్షల విలువైన 21 కార్ల స్వాధీనం
శేరిలింగంపల్లి, డిసెంబర్ 2: సెల్ఫ్ డ్రైవ్‌కు కార్లు ఇస్తే నెలనెలా అద్దె చెల్లిస్తామని నమ్మిం చి.. పదుల సంఖ్యలో కార్లను తీసుకొని, వా టినే వేరే వారికి అప్పగించి రెంట్ తీసుకుం టూ, అసలు ఓనర్లకు మాత్రం అద్దె చెల్లించకుండా ఎగనామం పెడుతున్న కిలేడీ ఆట కట్టించారు రాయదుర్గం పోలీసులు.
ఇందు కు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్, అడిషనల్ డీసీపీ జయ రాం సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. గచ్చిబౌలి టెలికాం నగర్‌కు చెందిన జూపిడి ఉషా, ఆమె డ్రైవర్ తుడుముల మల్లేశ్ కలిసి కార్ రెంటల్ సర్వీస్ నడుపుతున్నారు. పలువురి నుంచి కార్లను సెల్ఫ్ డ్రైవింగ్ కోసం అద్దెకు తీసుకున్నారు.
వాటిని బీదర్‌కు చెందిన సాగర్‌పాటిల్, బాల్కికి చెం దిన జమానే అనిల్ కుమార్‌కు ఇచ్చి కర్ణాటక ప్రాంతంలో నడుపుతున్నారు. వారి నుంచి నెలనెలా అద్దె పొందుతున్నారు. కానీ అసలు కార్ల ఓనర్లకు మాత్రం రెంట్ చెల్లించడం లే దు. తమ కార్లు ఎక్కడ ఉన్నాయని అడిగినా స్పందించడం లేదు. ఆందోళనకు గురైన కార్ల యజమానులు రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు.
కేసు నమోదు చేసిన రాయదుర్గం సీఐ వెంకన్న, డీఐ సతీష్‌కుమార్ దర్యాప్తు చేపట్టి జూపూడి ఉషా, ఆమె డ్రైవర్ తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మొత్తం ౨౧ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మహేంద్ర థార్, ఎర్టిగా, స్విఫ్ట్ తదితర కార్లున్నాయి. వీటి విలువ రూ.2 కోట్ల 50 లక్షలు ఉంటుందని డీసీపీ వినీత్ తెలిపారు.