calender_icon.png 26 December, 2024 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణమాఫీపై చర్చకు సిద్ధమా?

08-10-2024 01:54:29 AM

సీఎం రేవంత్‌కు బీజేఎల్పీ నేత ఏలేటి బహిరంగ లేఖ

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): ‘రైతు రుణమాఫీపై బహిరంగ చర్చకు సిద్ధమా ? మాఫీపై శ్వేతపత్రం విడుదల చేయగలరా ?’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి సోమవారం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ కాపీని మీడియాకు సైతం విడుదల చేశారు.

మాఫీ వర్తించక ఎంతోమంది రైతులు అల్లాడుతున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని సీఎం తుంగలో తొక్కారని ఆరోపించారు. ప్రధాని మోదీ ఈ నెల 5న మహారాష్ట్రలో చేసిన వ్యాఖ్యలపై స్పందించి సీఎం రేవంత్‌రెడ్డి 6న ప్రధానికి లేఖ రాశారని, ఆ లేఖలో సీఎం పచ్చి అబద్ధాలు రాసుకొచ్చారన్నారు.