అధికారం పోవడంతో కేటీఆర్‌లో అసహనం
సలహాలు ఇవ్వకుండా శాపనార్థాలు పెడుతున్నారు
ఈ దసరా పండుగకైనా కేటీఆర్ తీరు మారాలె
మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాం తి): ‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చిత్తశుద్ధితో ఉద్యోగాలు వేగవంతంగా భర్తీ చేస్తున్నది. విద్యార్థి, నిరుద్యోగు లు మా ప్రభుత్వం పట్ల సంతృప్తిగా ఉన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి ’ అని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
2 లక్షల ఉద్యోగాలు భర్తీ విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్‌కు మంత్రి పొన్నం స్పందించారు. అధికారం పోయిందన్న అసహనంతో కేటీఆర్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం గాంధీభవన్‌లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి పొన్నం హాజరయ్యారు.
పార్టీ కార్యకర్తలు, ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. అనంతరం మంత్రి పొన్నం మీడి యాతో మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలను నేరవేర్చుకుంటూ మందుకు వెళ్లుతున్నామని తెలిపారు. ప్రతిపక్ష హోదా లో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిపోయి ప్రభుత్వాన్ని కూల్చేస్తామని, దించేస్తామని శాపనార్థాలు పెడుతు న్నారని దుయ్యబట్టారు.
ఈ దసరా పండుగ సందర్భంగానైనా వారి మనసు మారాలని భగవంతుడిని కోరుతున్నామని పేర్కొన్నా రు. ప్రతిపక్షాలు ఇచ్చే సలహాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గత ప్రభుత్వం 150 మందికి విదేశీకి విద్యానిధి ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం 500 మందికి విదేశీ విద్యానిధి ఇస్తోందని వివరించారు.
పునరావాసం కల్పించాకే..
మూసీ విషయంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పొన్నం ఖండిం చారు. తమ పది నెలల పాలనకు, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. మూసీ నిర్వాసితులకు పునరావా సం కల్పించాకే ఖాళీ చేస్తామన్నారు. వరద సాయం కింద కేంద్రం కేవలం రూ. 400 కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు.
కార్యకర్తలు, ప్రజల కు మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాలలో కూడా అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి 179 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో రవాణ శాఖకు సంబంధించి 42, వివిధ మంత్రులకు 115 దరఖాస్తులు ఉండ గా, కలెక్టర్లకు పంపాల్సినవి 22 ఆర్జీలు వచ్చాయని మంత్రి చెప్పారు.