calender_icon.png 28 November, 2024 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడాది పాలనపై చర్చకు సిద్ధమా?

28-11-2024 02:17:51 AM

బీజేపీ నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్

హైదరాబాద్, నవంబర్ 2౭ (విజయక్రాంతి): కాంగ్రెస్ పాలన గతంలోని బీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తోందని బీజేపీ నే త ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ విమర్శించారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ సకలజనుల సర్వే.. అం టే కాంగ్రెసోళ్లు సమగ్ర కులగణన అంటున్నారని ఎద్దేవా చేశారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పురోగతి ఏమైందని ప్రశ్నించారు. రాహుల్‌కు రేవంత్, కేసీఆర్ కుడి, ఎడమ కళ్లుగా అభివర్ణించారు. అదానీ విరాళాలను తిరిగి ఇచ్చిన రేవంత్‌రెడ్డి... కాళేశ్వరం అక్రమాలకు కారణమైన కాంట్రాక్టర్ ఇచ్చిన విరాళాలను ఎందుకు తిరిగివ్వలేదని ప్రశ్నించారు.