calender_icon.png 19 April, 2025 | 12:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కంచ’ భూములపై చర్చకు సిద్ధమా?

13-04-2025 01:55:15 AM

  1. కేటీఆర్ ప్రెస్‌మీట్ ట్రైలర్ మాత్రమే..
  2. మహేశ్‌కుమార్ డమ్మీ ప్రెసిడెంట్.. మీనాక్షి నటరాజన్ సూపర్ సీఎం
  3. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద

హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): కంచ గచ్చిబౌలి భూముల అంశం లో పదివేల కోట్ల ఆర్థిక అవకతవకలు జరిగాయని తమ నేత కేటీఆర్ ఆధారాలతో నిరూపించినప్పటి నుంచి కాంగ్రెస్ నేతలు వాస్తవాలు కప్పిపుచ్చే విధంగా మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు.

ఈ అంశంలో పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్‌గౌడ్  సీఎంతో కలిసి చర్చకు వస్తే తాము వస్తామన్నారు. రేవంత్ ప్రభుత్వం ఈ వ్యవహారంలో పీకల్లోతు ఇరుక్కుపోయిందన్నారు. శనివారం హైదరా బాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో వివేకానంద మాట్లాడుతూ.. మహేశ్‌గౌడ్ డమ్మీ పీసీసీ ప్రెసిడెంట్ అని, గతంలో పీసీసీ ప్రెసిడెంట్లు సీ ఎంలు తప్పుచేస్తే వారిని, ప్రభుత్వాన్ని దారిలో పెట్టేవారని చెప్పారు.

మహేశ్‌గౌడ్ వాస్తవాలు చెప్పకుండా కేటీఆర్‌ను జైల్లో పెడతామని బె దిరిస్తున్నారన్నారు. తమను ఎవరూ భయపెట్టలేరని అన్నారు. విచారణ చేయాలని దర్యాప్తు సంస్థలకు లేఖలు రాయగలరా అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. కేసీఆర్ ఫార్మాసిటీకి 17వేల ఎకరాలు సేకరిస్తే వాటి ని రేవంత్‌రెడ్డి రియల్‌ఎస్టేట్ దందాకు వాడుతున్నారని ఆరోపించారు.

మీనాక్షి నటరాజ న్ సూపర్ సీఎంగా అవతరించారని, ఆమె రేవంత్ తప్పులను సరిచేస్తున్నారా, సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. కంచ గచ్చిబౌలి భూములపై అనేక వాదనలు తెరపైకి తీసుకువచ్చి ప్రజలను ప్రభుత్వం తప్పుదోవపట్టి స్తున్నారని ఆరోపించారు.

కేటీఆర్ ప్రెస్‌మీట్ ట్రైలర్ మాత్రమేనని త్వరలోనే మరిన్ని వివరాలు, బీజేపీ ఎంపీ పేరును కూడా బయట పెడతామని వివేకానంద అన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నేతలు మన్నె గోవర్ధన్‌రెడ్డి, కే కిషోర్ గౌడ్, తుంగబాలు పాల్గొన్నారు.