calender_icon.png 6 February, 2025 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటీ కడుతున్నారా.. రేషన్ ఉండదిక!

06-02-2025 01:19:32 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: దేశంలో ఎవరైతే ఐటీ చెల్లిస్తారో వారి రేషన్ కట్ చేసేందుకు ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన కింద ఇచ్చే ఫ్రీ రేషన్ లబ్ధిదారుల్లో అనర్హుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. పన్ను చెల్లింపుదారుల వివరాలను ఆహార మంత్రిత్వ శాఖతో ఐటీ శాఖ పంచుకోనుంది.

పీఎంజీకేఏవై కింద పేద కుటుంబాలకు కేంద్రంలోని బీజేపీ ఉచితంగా రేషన్ అందిస్తోంది. ఈ పథకం కోసం భారీగా నిధులు కేటాయిస్తోంది. అయితే ఇప్పుడు ఈ పథకంలో అనర్హుల ఏరివేతకు కేంద్రం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. అదే కనుక నిజం అయితే లబ్ధిదారుల సంఖ్యలో కోత పడే అవకాశం ఉంది.