calender_icon.png 19 April, 2025 | 4:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్న బియ్యమే ఇస్తున్నారా..!

11-04-2025 12:00:00 AM

రేషన్ షాప్ తనిఖీ చేసిన కలెక్టర్ 

మహబూబాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): రేషన్ కార్డు హోల్డర్లకు ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యమే ఇస్తున్నారా అంటూ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేసి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. గురువారం మహబూబాబాద్ నెల్లికుదురు మండలాల్లో రేషన్ షాపులను తనిఖీ చేశారు.

రేషన్ షాపుల్లోని బియ్యం స్టాక్ పరిశీలించి లబ్ధిదారులను బియ్యం పంపిణీ పై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా గ్రామాల్లోని పలువురు లబ్ధిదారుల ఇంట్లో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పొ కలిసి సహపంతి భోజనం చేశారు. అలాగే నెల్లికుదురు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల అన్ లైన్ ప్రక్రియను  పరిశీలించారు.

అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఎండాకాలం నేపథ్యంలో వైద్య సిబ్బంది అమలు చేస్తున్న వివిధ రకాల సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. వేసవిలో మందులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఇండెంట్ ఇచ్చి మందులు స్టాక్ పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రేమ్ కుమార్, తాసిల్దార్లు భగవాన్ రెడ్డి, రాజు, ఎంపీడీవో రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.