కొన్ని ఆన్‌స్క్రీన్ జంటలకు ఫ్యాన్ ఫాలో యింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. వారిని ఎంతగానో ఇష్టపడతారు. అలాంటి జంటల్లో సల్మాన్ ఖాన్, ప్రీతి జింటా ఒకరు. వీరిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందంటూ పెద్ద ఎత్తు న ప్రచారం జరిగింది. అయితే వీరిద్దరూ ఈ విషయంపై ఎప్పుడూ స్పందించింది లేదు. తాజాగా ప్రీతి జింటాకు స్పందించాల్సిన అవసరం వచ్చింది. ఓ నెటిజన్ ప్రశ్నకు సమాధానంగా ఆమె క్లారిటీ ఇచ్చారు.
డిసెంబర్ 27న సల్మాన్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ప్రతి జింటా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘హ్యాపీ బర్త్‌డే సల్మాన్.. అందరికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నా. మిగిలినది నీతో మాట్లాడినప్పుడు చెబుతా. మనం చాలా ఫోటోలు తీసుకోవాలి. లేదంటే నేను పాత ఫోటోలనే పోస్ట్ చేస్తూ ఉంటా” అని పోస్ట్ పెట్టింది. ప్రీతి పోస్ట్‌పై స్పందించిన నెటిజన్.. ‘మీరిద్దరూ ఎప్పుడై నా డేట్‌లో ఉన్నారా?’ అని ప్రశ్నించాడు.
దీనికి ప్రీతి సమాధానమిస్తూ.. ‘అలాంటిదేమీ లేదు. తను నాకు క్లోజ్ ఫ్రెండ్. నా భర్తకు కూడా మంచి స్నేహితుడు. నా సమాధానం మీకు ఆశ్చర్యం కలిగిస్తే క్షమించండి” అని తెలిపింది. ‘హర్ దిల్ జో ప్యార్ కరేగా, చోరీ చోరీ చుప్కే చుప్కే’ వంటి హిందీ చిత్రాలతో ఆన్‌స్క్రీన్ జోడిగా ప్రీ తి, సల్మాన్ పేరు తెచ్చుకున్నారు.