- జనగామ జిల్లాలో ఎండుతున్న పంటలు
- మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య
జనగామ, ఆగస్టు 13(విజయక్రాంతి): పచ్చగా కళకళలాడాల్సిన పొలాలు నీళ్లు లేక ఎండిపోతుంటే కాంగ్రెస్ సర్కార్ నీళ్లు వదలకుండా రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. జనగామ జిల్లా ఏర్పాటుకై జరిపిన ఉద్యమానికి సం బంధించిన కేసులో ఆయన మంగళవారం జనగామ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడి యా సమావేశంలో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నీళ్లను దోచుకుని పోతుంటే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి సోయి లేదని విమర్శించారు.
జనగామ జిల్లాలో ఫేస్ 1లో పంపు ఒక్కసారి వదిలితే పంటలకు ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. గోదావరి జలాలు సముద్రంలో కలుస్తుంటే తన గుండె తరుక్కుపోతోందన్నారు. జనగామ రిజర్వాయర్ ఎండిపోతున్నా పైనుంచి నీటిని విడుదల చేయడం లేదన్నారు. ఇలాగే కొనసాగితే ప్రజలు, రైతులను కలుపుకుని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. వారివెంట జనగామ మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి ఉన్నారు.