calender_icon.png 28 November, 2024 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ తప్పులు చేస్తున్నారా?

28-11-2024 12:00:00 AM

ప్రస్తుతం జీవన శైలి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది. మానసిక ఒత్తిడి తక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం మానసిక ఒత్తిడి ఎక్కువైంది శారీరక శ్రమ తగ్గింది. గంటల తరబడి కూర్చును పనిచేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. పనిచేసే విధానం కూడా అలానే మారిపోయింది. గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఎలాంటి శారీరక శ్రమ లేకుండా గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గంటల తరబడి కదలకుండా కూర్చోవడం వల్ల త్వరగా వృద్ధాప్యం వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కచ్చితంగా రోజులో 30 నిమిషాల్లో వాకింగ్ లేదా ఏదో ఒక వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. అలాగే కనీసం రెండు గంటలకు ఒకసారైనా లేచి ఒక వంద అడుగులైనా వేయాలని చెబుతున్నారు.